Satamanam

Satamanam

Tuesday, September 27, 2016

Akasamloni chandamama - Deviputrudu


ఆకాశంలోని చందమామ

బంగారు పాపై వచ్చేనమ్మా

సాగరమాయే సంబరమే

స్వాగతమాయే సంతసమే

నాలోని ప్రేమ ప్రతిరూపమే

ఇంట తానే సిరిదీపమే(ఆకాశం)

 

నింగిలో నీలమంతా

ఉంగరం చేసి ఇస్తా ఊరేగిస్తా

సాగరం పొంగులన్నీ

గవ్వల గౌను చేస్తా గారం చేస్తా

తెల్లని ఏనుగుపై నా పాపను ఎక్కిస్తా

చిలకలు హంసలని

ఆడేందుకు రప్పిస్తా

హరివిల్లే కాగా ఊయలలే

కోయిలలే పాడే నా జోలలే

బొమ్మలుగా మారే చుక్కలే

దిష్టంతా తీసే నలుదిక్కులే

 

పాపలో అందమంతా

బ్రహ్మకే అందనంత ఎంతో వింత

అమ్మలో ప్రేమ అంతా

నాన్నలో ఠీవి అంతా వచ్చేనంట

తీయని నవ్వేమో

దివి తరాల వెలుగంట

కమ్మని పిలుపేమో

అమ్మకు పులకింత

అడుగేసి తీస్తే హంస జోడి

కులుకుల్లో తానే కూచిపూడి

చిరునవ్వులోన శ్రీరమణి

మారాము చేసే బాలామణి(ఆకాశం)

No comments:

Post a Comment