ఆమని పాడవే హాయిగా..మూగవైపొకు ఈ వేళ..
రాలేటి పూల రాగాలతో..పూసేటి పూల గంధాలతో..
మంచు తాకి కోయిల..మౌనమైన వేళల..
ఆమని పాడవే హాయిగా..
ఆమని పాడవే హాయిగా..
వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా..
మనస్సులో నిరాశలే..రచించెలే మరీచికా
పదాల నా ఎద..స్వరాల సంపద
తరాల నా కథ..క్షణాలదే కదా
గతించిపోవు గాధలేననీ..!
ఆమని పాడవే హాయిగా..
మూగవైపోకు ఈ వేళ..
రాలేటి పూల రాగాలతో..
సుఖాలతో పిఖాలతో..ధ్వనించినా మధూదయం
దివి భువి..కలా నిజం..స్ప్రుశించినా మహోదయం..
మరో ప్రపంచమే..మరింత చేరువై
నివాళి కోరిన..ఉగాది వేళలో గతించిపోని గాధలేననీ..!
ఆమని పాడవే హాయిగా..మూగవైపొకు ఈ వేళ..
రాలేటి పూల రాగాలతో..పూసేటి పూల గంధాలతో..
మంచు తాకి కోయిల..మౌనమైన వేళల..
ఆమని పాడవే హాయిగా..
ఆమని పాడవే హాయిగా..
No comments:
Post a Comment