Satamanam

Satamanam

Tuesday, September 27, 2016

Asalem gurtuku - Antapuram అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు


అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు
నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు నిమిషం కూడా
నిన్ను చూడక - (2)
నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా
ఉన్నా నేను నీ కోసం
నువ్వు దూరమైతే బతకగలనా
ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు
నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు నిమిషం కూడా
నిన్ను చూడక


గోరువెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని
వినిపించనీ….
ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని
చిగురించనీ
అల్లుకోమని గిల్లుతున్నది చల చల్లని గాలి
తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి
ఏకమయే.... ఏకమయే ఏకాంతం లోకమయే వేళ
ఆహ జంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెల (అసలేం)


కంటిరెప్పల చాటుగా నిన్ను దాచుకుని
బంధించనీ….
కౌగిలింతల సీమలో కోట కట్టుకుని
కొలువుండనీ….
చెంత చేరితే చేతి గాజులు చేసే గాయం
జంట మద్యన సన్నజాజులు హాహాకారం
మళ్ళి మళ్ళి……
మళ్ళి మళ్ళి రోజు రమ్మన్నా రాదేమో
నిలవనీ చిరకాలమిలాగే క్షణం (అసలేం)

No comments:

Post a Comment