Satamanam

Satamanam

Tuesday, September 27, 2016

Andalalo aho - Jagadeka veerudu atiloka sundari అందాలలో అహో మహోదయం


లలలల లాల లాల - 3

అందాలలో అహో మహోదయం

భూలోకమే నవోదయం

పువ్వు నవ్వు పులకించే గాలిలో

నింగీ నేల చుంబించే లాలిలో

తారల్లారా రాలే విహారమే

అందాలలో అహో మహోదయం

నా చూపుకే శుభోదయం

 

లత లత సరగామడే

సుహాసిని సుమాలతో

వయస్సుతో వసంతమాడి

వరించెలే సరాలతో

మిల మిల హిమాలే

జల జల ముత్యాలుగా

తళతళ గళాన తటిల్లత హారాలుగా

చేతులు తాకినా కొండలకే

చలనము వచ్చెనులే

ముందుకు సాగిన ముచ్చటలో

మువ్వలు పలికెనులే

ఒక స్వర్గం తలవంచి

ఇలచేరే క్షణాలలో(అందాలలో)

 

సరస్సులో శరత్తు కోసం

తపస్సులే ఫలించగా

సువర్నిక సుగంధమేదో

మనస్సునే హరించగా

మరాలినై ఇలాగే మరి మరి నటించనా

విహారినై ఇవాలే దివి భువి స్పృశించనా

గ్రహములు పాడిన పల్లవికే

జాబిలి ఊగెనులే

కొమ్మలు తాకిన ఆమనికే

కోయిల పుట్టెనులే

ఒక సౌఖ్యం తనువంతా

చెలరేగే క్షణాలలో (అందాల)

No comments:

Post a Comment